ఆమోసు 2
1 యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు. 2 మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది. 3 దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు. 4 యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు. 5 యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”