యోబు 37
1 దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది. 2 దేవుని స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి. 3 ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు. 4 దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు. 5 దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. 6 నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. 7 మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. 8 జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి. 9 దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి. 10 దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది. 11 ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు. 12 ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి. 13 ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు.